మొన్న జరిగిన 'బిగ్ బాస్' రియాలిటీ షో ఏ రేంజ్ లో పాపులర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షోలో 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. అందులో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా ఒకరు. అప్పటివరకు కొద్ది మందికే తెలిసిన మహేష్ బిగ్ బాస్ పుణ్యమా అని అందిరికీ పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కొన్నినెగిటివ్ కామెంట్లు చేసి బాగా పాపులర్ అయ్యాడు. పవన్ ఫాన్స్ మహేష్ ని ఫోన్లో, సోషల్ మీడియాలో చాలా దారుణమైన తిట్లు తిట్టారు. కొంతమంది అయితే ఆయన్ని చంపుతామని కూడా బెదిరించారు. దీంతో పలు చానల్స్ లో ఆయన ప్రత్యక్షమై తన ఆవేదనని వ్యక్తం చేసాడు.
ఇదిలా ఉంటే ఈ మధ్య 'జబర్ధస్త్' కామెడీ తో పాపులర్ అయిన హైపర్ ఆది కత్తి మహేష్ ని ఉద్దేశించి 'ముందు పొట్ట.. వెనుక బట్ట ఉండి రివ్యూలు రాయటం కాదు' అని జోక్ పేల్చాడు. ఈ జోక్ పై స్పందించిన కత్తి మహేష్ మరోసారి సోషల్ మీడియాలో హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేసాడు.
చివరికి మొన్న జరిగిన ఒక సినిమా ప్రీమియర్ షో లో ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోని ఫోస్ట్ చేసి మేము.. మేము కలిసే ఉంటాం. మధ్యలో దూరిన అభిమానులు వెధవలు అవుతారు అంటూ కామెంట్స్ చేసాడు కత్తి మహేష్. దీనిపై స్పందించిన హైపర్ ఆది తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ ఇచ్చాడు.
అభిమానులని వెధవలు అనడం సరైన పదం కాదని, తాను కూడా పవన్ అభిమానినే.. అంటే నేను కూడా వెధవనేనా అంటూ సీరియస్ అయ్యాడు. ఇలాంటి వాఖ్యలు చేస్తే ఏ హీరో అభిమానైనా కొడతారని కత్తి మహేష్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.