ఈమధ్య హైపర్ ఆది పేరు గట్టిగా వినిపిస్తోంది. తన వల్ల.. ఓ హీరో ఫ్యాన్స్ బాగా హర్టయ్యారని, హైపర్ ఆది కోసం హైదరాబాద్ అంతా గాలిస్తున్నారని, తనేమో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైపర్ ఆది తొలిసారి స్పందించాడు. ఓ వీడియో బైట్ ని విడుదల చేశాడు.
‘‘గత రెండు రోజుల నుండి ఓ ఫేక్ న్యూస్ బాగా వినిపిస్తోంది. హైపర్ ఆది కోసం ఎవరో వెతుకుతున్నారని, దాడి చేయడానికి వెతుకుతున్నారని.. ఇలా ఏవేవో ఫేక్ న్యూస్‌లు నాపై రాస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వారందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకు చెప్పండి. నేను సంపాదించే దానిలో కొంత ఇస్తాను. మేము హ్యాపీగా షూటింగ్స్ చేసుకుంటున్నాం. జబర్ధస్త్ స్కిట్ రిహార్సల్స్ చేస్తున్నాం. రాజుగారు, శాంతి స్వరూప్ నా పక్కనే ఉన్నారు చూడండి. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వారందరిని మా శాంతిస్వరూప్‌కి అప్పగించాలి. భలే ఉంటది. అందరూ హ్యాపీగా ఉండండి.. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం..’’ అంటూ తన పై ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్న వాళ్లపై తనదైన శైలిలో స్పందించాడు హైపర్ ఆది.