లేడీ ప్రకాష్ రాజ్ అవ్వాలనుంది: అనసూయ

By iQlikMovies - April 04, 2018 - 16:14 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు రంగస్థలం విజయవంతం అయ్యాక ఆ సినిమా తాలుకా వినిపిస్తున్న పేర్లలో అనసూయ పేరు ప్రముఖంగా ఉంది. కారణం- ఆమె చేసిన రంగమత్త పాత్ర. ఈ పాత్రకి ఆమె నటనతో ప్రాణం పోసింది అనే చెప్పాలి, అలాగే ఈ చిత్రంలో ఆమె పాత్రకి ఉన్న ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువే అని చెప్పాలి.

ఇక ఆమె కూడా తన పాత్రకి వస్తున్న స్పందన చూసి ఆనందంలో మునిగిపోయింది. నటిగా ఆమె ప్రయాణం మొదలైన తొలినాళ్ళలోనే ఇటువంటి పాత్ర అనసూయకి దొరకడం ఒకరకంగా అదృష్టమనే చెప్పాలి. అయితే ఆమెకి ఈ పాత్ర ఇచ్చిన నమ్మకం కాని ప్రోత్సాహం వల్ల కాని భవిష్యత్తులో ఇటువంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ధైర్యం వచ్చింది అని చెప్పింది.

ఇదే సమయంలో ఆమె తొలుత తన పాత్ర చివర అత్త అనే పదం తీసెయ్యల్సింది గా సుకుమార్ ని అడిగినప్పట్టికి, సినిమా విడుదల తరువాత మాత్రం అలా పిలవడం వల్లనే అంతటి గుర్తింపు వచ్చింది అని తెలిపింది. అయితే తనకి నటనలో లేడీ ప్రకాష్ రాజ్ అనిపించుకోవడం తన డ్రీం అని ఎందుకంటే ఎటువంటి పాత్రనైనా తనదైన విలక్షణతతో నటించడం ఆయనకే సొంతం అని అందుకే తనని లేడీ ప్రకాష్ రాజ్ అని గుర్తించేలా తాను కష్టపడతాను అని హామీ ఇచ్చింది.

అయితే ప్రకాష్ రాజ్ అంతటి స్థాయి దక్కాలి అంటే అనసూయ పెద్ద ఎత్తున కష్టపడాల్సి ఉంటుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS