హీరోగా నారా రోహిత్‌ది ఓ కొత్త స్టైల్. ఆయన ఎంచుకున్న స్టోరీలన్నీ విలక్షణంగానే ఉంటాయి. మొదటి సినిమా 'బాణం' దగ్గర్నుంచీ రోహిత్ సినిమాలు అదో రకంగా ఉంటాయి. సక్సెస్ రేటు ఎలా ఉన్నా, రోహిత్ సినిమాలు బాగుంటాయి అనే టాక్ మాత్రం బాగా వినిపిస్తూ ఉంటుంది. గతేడాది 'జ్యో అచ్యుతానంద' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నారా రోహిత్‌కి మరో విజయం తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో రోహిత్ చేసిన పాత్ర చాలా కొత్తగా ఉంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సినిమాతో రోహిత్ నిర్మాణంలో కూడా అడుగు పెట్టాడు. ఇకపై కూడా నిర్మాతగా పలు విలక్షణ చిత్రాలు చేస్తానంటున్నాడు రోహిత్. రోహిత్‌కి కథ నచ్చితే చాలు, అందులో క్యారెక్టర్స్ గురించీ, తన నటన గురించీ అస్సలు పట్టించుకోడు. అందుకే ఈ సినిమాలో 60 ఏళ్ల వృధ్ధుడి గెటప్‌లో కూడా నటించి మెప్పు పొందాడు. గతేడాది నారా రోహిత్ నుండి చాలా సినిమాలే వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకూ ప్రేక్షకాదరణ పొందలేదు. అలా వచ్చి ఇలా పలకరించి వెళ్లిపోయాయి. కొన్ని సినిమాలయితే ఎప్పుడొచ్చాయో ఎప్పుడెళ్లాయో కూడా తెలీదు. అందుకే ఈ ఏడాది ఆచి తూచి అడుగులేస్తానంటున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఇయర్‌లో ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా అదేనంట నారా రోహిత్‌ది.