కరోనా కాటుకు ప్రముఖ పాత్రికేయుడు టీఎన్నార్ బలైన సంగతి తెలిసిందే. టీఎన్నార్ మరణ వార్తని.. చిత్రసీమ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు టీఎన్నార్ కుటుంబానికి నైతికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలబడేవాళ్లు ఎక్కువవుతున్నారు.
చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అది మొదలు ఆ కుటుంబానికి సాయం అందుతూనే ఉంది. సంపూర్ణేష్ బాబు, మారుతి చెరో 50 వేలు సహాయంగా అందించారు. ఇప్పుడు ఐ డ్రీమ్ సంస్థ ముందుకొచ్చింది. తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సంస్థ ప్రకటించింది. టీఎన్నార్.. ఆ సంస్థలోనే ఉద్యోగిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థ.. టీఎన్నార్ కుటుంబాన్ని ఆదుకుంది. టీఎన్నార్ పిల్లల బాధ్యత కూడా తామే తీసుకుంటున్నట్టు సంస్థ ఛైర్మన్ ప్రకటించారు.