మహానటి చిత్రంతో కీర్తి సురేష్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానులు అయిపోయారు. ఇక కెరీర్ పరంగా కూడా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. ఇక తమిళనాట అయితే ఆమె ప్రస్తుతం ఇళయతళపతి విజయ్ తో మురుగదాస్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నటిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన వర్కింగ్ స్టిల్ ఒకటి బయటికొచ్చింది, ఇప్పుడు ఆ స్టిల్ వల్లనే విజయ్ ఫ్యాన్స్ కి కీర్తి టార్గెట్ గా మారింది. ఇంతకి ఆ స్టిల్ లో ఏముంది అంటే- కీర్తి తన కాలితో హీరో విజయ్ కాలుని తొక్కినట్టు గా ఉంది. దీనితో తమ అభిమాన హీరోని అగౌరవ పరిచేలా ఉందంటూ ఆమె పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనికి కీర్తి ఫ్యాన్స్ కూడా ఇది కేవలం సినిమా కోసమే చేసి ఉండొచ్చు. అంతేతప్ప ఇలా కావాలని ఎవరు చేయరు అంటూ తమ హీరోయిన్ కి మద్దతుగా నిలుస్తున్నారు.
గతంలో నటి సమంత కూడా మహేష్ బాబు సినిమాకి సంబంధించి పోస్టర్ పైన కామెంట్ చేయడం అది కాస్తా మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో అప్పట్లో అది పెద్ద సంచలనం అవ్వడం జరిగింది.
ఏదేమైనా.. హీరోల ఫ్యాన్స్ అంటూ చెప్పుకొని ఇలా అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి చేయడం పరిపాటిగా మారింది. మొత్తంగా ఇలాంటి పరిణామం మాత్రం మంచిది కాదు అని చెప్పోచ్చు.