కళ్యాణ్‌రామ్‌ - తమన్నా కెమిస్ట్రీ అంతకు మించి..

By iQlikMovies - June 13, 2018 - 16:05 PM IST

మరిన్ని వార్తలు

తొలిసారిగా కళ్యాణ్‌రామ్‌తో తమన్నా జోడీ కడుతోంది 'నా నువ్వే' చిత్రంతో. 

ఇదో డీప్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాలా అనిపిస్తోంది. టీజర్‌, పోస్టర్స్‌లో తమన్నా, కల్యాణ్‌రామ్‌ కెమిస్ట్రీ పిచ్చెక్కించేస్తోంది. తమన్నా ఈ సినిమాలో కొంచెం బొద్దుగా కనిపిస్తూ ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తోంది. అంతేకాదు, యాక్టింగ్‌కి బాగా స్కోపున్న పాత్రలో కనిపిస్తోంది తమన్నా. 'ఊపిరి' తర్వాత తమన్నా ఈ సినిమాకి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. 'ఊపిరి'తో కంపేర్‌ చేస్తే ఈ సినిమాలో తమన్నా వాయిస్‌ చాలా క్లారిటీగా అనిపిస్తోంది. 'నా ప్రేమ, నా బాధ అందరికీ వినిపిస్తోంది. నీకు వినిపించడం లేదా?' అని చెప్పే డైలాగ్‌లో తమన్నా ఫేస్‌లో చూపించే హావ భావాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. 

ఓ సాంగ్‌లో తమన్నా చేసిన డాన్సుకి శాంతం అందరూ ఫిదా అయిపోతున్నారు. తమన్నా మంచి డాన్సరే ఇది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఏరోబాటిక్స్‌ టైప్‌లో ఈ సినిమాలో ఓ సాంగ్‌కి తమన్నా చేసిన డాన్స్‌ నభూతో న భవిష్యతి అనేలా ఉంది. ఇకపోతే కళ్యాణ్‌రామ్‌ని సరికొత్త లుక్‌లో చూడబోతున్నామీ సినిమాలో. ఫుల్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ని చూపిస్తున్నాడు. అయితే మూడిస్ట్‌ పాత్రలా ఉంది కళ్యాణ్‌రామ్‌ పాత్ర చిత్రీకరణ. చూడాలి మరి, తమన్నాకీ, కళ్యాణ్‌రామ్‌కీ ఏ రకంగా పేరు తెచ్చిపెడుతుందో ఈ సినిమా. 

రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది 'నా నువ్వే'. జయేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS