నటి ఇలియానా ఈమధ్య ఒక్కసారిగా కొంతమంది మండిపడింది.
కారణమేమిటంటే- తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆండ్రూ తో కలిసి దిగిన ఫోటోలు చాలా కాలంగా పెడుతూ వస్తున్నది. అయితే ఆ ఫొటోలపై కొంతమంది తమకి నచ్చినట్టుగా కామెంట్స్ చేయడం ఆమె తప్పుబట్టింది.
తను నటి అయిన కారణంగా ప్రేక్షకులు ఏదో ఒక అభిప్రాయం చెప్పడం సహజమేనని కాని తన బాయ్ ఫ్రెండ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు అని తన భాదని వెలిబుచ్చింది. అయినా తాము సెలబ్రిటీలు అయినంత మాత్రాన తమకంటూ ఒక ప్రైవేటు లైఫ్ ఉండకూడదా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నది.
ఇదంతా చూసిన కొంతమంది మాత్రం ఇలా ఫోటోలు పెట్టడం వల్ల తానే ఒకరకంగా ఇటువంటి కామెంట్స్ చేసేవారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతున్నది అని అంటున్నారు.
ఏదేమైనా ఇలియానాకి ఇదొక కొత్త తలనొప్పిగా మారింది.