ఇప్పటివరకు గొప్ప నటుడిగానే మనకు పరిచయం ఉన్న ఎన్టీఆర్, ఎపుడైతే బిగ్ బాస్ తెలుగు షోని హోస్ట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటినుండి ఒక కొత్త ఎన్టీఆర్ ని అందరు చూస్తున్నారు.
దీనితో ప్రేక్షకులు ఒక్కసారిగా తమకి తెలియని ఎన్టీఆర్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇటు ప్రేక్షకులే కాదు అటు ఎన్టీఆర్ కూడా ఒకరకంగా ఆశ్చర్యానికిగురవుతున్నాడట. కారణమేంటంటే- తన హోస్టింగ్ కి అలాగే బిగ్ బాస్ కి ఇంతలా రెస్పాన్స్ వస్తుందని తాను కూడా అస్సలు ఊహించలేదు అని ఎన్టీఆర్ చెబుతున్నాడు.
ఒకరకంగా ఇది తనకి కూడా నమ్మలేనట్టుగా ఉంది అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఇక ఈ షో ఇప్పటికే ఆఖరి వారానికి చేరుకొని, ఎవరు టైటిల్ ని గెలుస్తారు అన్న టెన్షన్ లో ప్రేక్షకులందరిలో ఉంది.