'ఇది రివెంజ్ కాదు.. రిటర్న్ గిఫ్ట్' - 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. దీన్ని బట్టి ఈ సినిమా ఓ రివైంజ్ డ్రామా అనేది అర్థమైపోతోంది. `ఇది రివెంజ్ డ్రామానే.. అయితే. దాన్ని మించి బలమైన పాయింట్ మరోటి ఉంది` అని శ్రీనువైట్ల కూడా పదే పదే చెబుతున్నారు.
చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని దూరం చేసిన ఓ ముఠాపై రవితేజ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఈసినిమా స్టోరీ. అయితే ఆ ప్రతీకారం అనే పాయింట్ హీరో ఒక్కడిదే కాదు. కథానాయికకూ ఓ రివెంజ్ డ్రామా ఉంటుందట. అవును... ఇందులో రవితేజ పక్కన ఇలియానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
రవితేజతో పాటు ఈ సినిమాలో ఇలియానా కూడా రివెంజ్ తీర్చుకుంటుందని, అయితే హీరో రివెంజ్ విలన్లపై అయితే... హీరోయిన్ రివైంజ్ ఎవరిపైనో అన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో ఇలియానా పాత్ర చాలా బలంగా ఉంటుందని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఇలియానా పాత్రని శక్తిమంతంగా తీర్చిదిద్దార్ట.
ఇందులో ఇలియానా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా నటించిందని సమాచారం. మొత్తానికి చాలా కాలం గ్యాప్ తరవాత తెలుగులో సినిమా చేస్తున్న గోవా బ్యూటీకి మంచి పాత్రే దక్కింది.