నాజూకు నడుముతో కుర్రకారును ఉర్రూతలూగించిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు బొద్దుగుమ్మ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా కానీ ఇలియానాని ఆ స్థాయి వెయిట్లో ఇంతకుముందెన్నడూ చూసింది లేదు. అలాంటిది 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో ఇలియానా బొద్దుతనంపై కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.
ఇలియానా అంటేనే స్లిమ్ సుందరి. అలాంటిది అంత బొద్దుతనాన్ని ఆడియన్స్ ఏక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆడియన్సే కాదట. హీరోలు కూడా ఇలియానాని రిజక్ట్ చేస్తున్నారనీ టాక్. ఎలాగోలా రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించేసుకుంది కానీ, ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఇలియానాకి నెక్ట్స్ ఛాన్స్ రావాలంటే మాత్రం ఆమె ఇదివరకటిలా సన్నగా నాజూకు నడుముతో కనిపించి తీరాల్సిందే. లేటెస్టుగా అందుతోన్న సమాచారమ్ ప్రకారం ఇలియానా తన బొద్దుతనంతో ఆల్రెడీ రావాల్సిన ఓ ఛాన్స్ మిస్ చేసుకుందనీ తెలుస్తోంది.
బాలీవుడ్లో కూడా ఇలాంటి ఫిజిక్‌తో ఆఫర్స్ అంటే అస్సలు మొహమాటమే లేకుండా నో అనేస్తారు. తమిళ తంబీలకైతే బొద్దు భామలు నచ్చుతారేమో కానీ, తెలుగు తమ్ముళ్లు, బాలీవుడ్ బుల్లబ్బాయిలు అస్సలు ఒప్పుకోరు. మరి బెల్లీ బేబ్స్కి ఈ కామెంట్స్ చేరుతున్నాయో లేదో కానీ, పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
అస్సలు తెలుగులో కెరీర్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో రవితేజ పుణ్యమా అని రీ ఎంట్రీ అయితే జరిగింది. అది నిలదొక్కుకునేలా ఇలియానా ఎలాంటి ప్రయత్నాలు చేయనుందో చూడాలిక.