బికినీ బ్యూటీకి దక్కిన అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు

బికినీ బ్యూటీ ఇలియానాకి 'ఫిజి' అంటే చాలా చాలా ఇష్టం. తన బాయ్‌ఫ్రెండ్‌ సహా పలువురు సన్నిహితుల్ని వెంటేసుకుని తరచూ ఫిజీకి వెళ్ళి వస్తుంటుంది ఇలియానా. అక్కడ చాలామంది ప్రముఖులతో అత్యంత సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తోంది ఈ నాజూకు బ్యూటీ. ఇలియానా తరచూ ఫిజీ వెళ్ళి వస్తుండడంతో, అక్కడే ఆమె 'సెటిలైపోతుంది' అని అంతా అనుకున్నారు. అయితే, ఇలియానా అక్కడ సెటిలైపోలేదుగానీ, ఆ దేశం తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇటీవల ఇలియానాని ఎంపిక చేసింది. 

ఫిజీ అందాలు తనకెంతో ఇష్టమనీ, అందుకే ఆ దేశానికి తరచూ వెళ్ళి వస్తుంటాననీ, ప్రపంచానికి ఫిజీ గురించి తక్కువే తెలుసనీ, తనవంతుగా ఫిజీ తరఫున ప్రచారం నిర్వహిస్తాననీ ఇలియానా చెబుతోంది. ఫిజిలో పర్యాటక ప్రాంతాల పట్ల అవగాహన కోసం తరచూ అక్కడికి వెళ్ళి వచ్చిన ఇలియానా, ఆల్రెడీ చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులకి ఫిజీని పరిచయం చేసింది. దాంతో ఇలియానా పట్ల ఫిజి ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా వ్యవహరించింది. ఇలియానా కోరుకుంటే ఆమె కోసం ఫిజీలో నివాసానికిగాను ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కూడా అంటోంది ఫిజీ ప్రభుత్వం. 

గోవా బ్యూటీ ఇలియానాకి, సముద్ర తీర సొగసులంటే చాలా చాలా ఇష్టం. ఫిజీని ఆమె అంతగా ఇష్టపడటానికి కూడా అక్కడి నీటి వనరులే కారణమట. కల్మషం లేని మనుషులు, ప్రకృతి సోయగాలు.. ఇవన్నీ చూస్తే, ఫిజీ దేవతల నివాసంలాగా అనిపిస్తుందని ఇలియానా చెబుతోంది. వారెవ్వా ఇలియానా, ఫిజీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసిందని ఇప్పుడు బాలీవుడ్‌ సినీ జనం చెప్పుకుంటున్నారు. వేరే దేశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడమంటే ఇలియానా పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతున్నట్లే లెక్క.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS