ఇల్లీ బేబ్‌ని ఇలా భరించడం కష్టమే

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రామ్‌ నటించిన తొలి సినిమా 'దేవదాసు'తో తెలుగు తెరకు పరిచయమైంది ఇల్లీ బేబ్‌ అలియాస్‌ ఇలియానా. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా ఇలియానా 'నాజూకు నడుము' సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 

నిజమే మరి, బెల్లీ బ్యూటీ అంటేనే ఇలియానా.. ఆ స్థాయిలో వెండితెరపై తన నాజూకు నడుము అందాల్ని ఆరబోసేసింది. అలాంటి ఇలియానా, 'కిక్‌' సినిమా కోసం కాస్త లావెక్కినా, ఆ తర్వాత మళ్ళీ సన్నబడిపోయింది. 'ఇల్లియానా.. బెల్లియనా..' అంటూ విజయ్‌ సరసన ఓ సినిమాలో ఇల్లీ బేబ్‌ ఆడి పాడటం.. ఆ పాటని ఆమె కోసమే ప్రత్యేకంగా రాయించడం తెల్సిన సంగతులే. ఇక, ఈ బ్యూటీ తన తాజా తెలుగు సినిమా 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'లో మాత్రం బాగా బొద్దుగా కన్పిస్తోంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఆ సినిమాలో వున్నది ఇలియానానేనా? అన్న అనుమానాలొస్తున్నాయ్‌ మరి. సినిమా ప్రమోస్‌లో ఇంతవరకు ఎలాంటి గ్లామరస్‌ స్టిల్స్‌ ఇలియానాకి సంబంధించి వాడలేదు. ఎందుకు? అన్న ప్రశ్నకు ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి అందుతోన్న సమాచారం, ఇది రొటీన్‌ సినిమా కాదని. ఇలియానా నుంచి గ్లామర్‌ ఆశించకూడదనీ, ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌ అనీ, శ్రీనువైట్ల రేసీ స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాడనీ అంటున్నారు. 

ఏమో, అదెంత నిజమోగానీ.. ఇలియానా అభిమానులు మాత్రం, ఆమె సినిమాలో గ్లామరస్‌గా కన్పించకపోతే డిజప్పాయింట్‌ అయ్యే ఛాన్సుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS