తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో 'పాగల్ పంతీ' సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న ఇలియానాని తెలుగు సినిమాల గురించి అడిగితే, త్వరలోనే ఓ క్రేజీ ఆఫర్‌తో వస్తానని చెప్పింది. ఆ క్రేజీ ఆఫర్ మెగా ఆఫర్ అంటూ కథలల్లేస్తున్నారు బెల్లీ బేబీ ఫ్యాన్స్. అది కూడా మెగాస్టార్ సినిమా అంటున్నారు. మెగాస్టార్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌కి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు.
ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ అంటూ సీనియర్ భామల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆ లిస్టులోకే ఇలియానా చేరిందా.? లేక, ఇల్లీ బేబ్ కోసం కొరటాల సినిమాలో ఓ ఐటెం సాంగ్ సిద్ధంగా ఉందా.? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇలియానా నటిస్తున్న 'పాగల్ పంతీ' సూపర్ హిట్ అయితే, ఇలియానా బాలీవుడ్‌ని వదిలి టాలీవుడ్‌కి వస్తుందా.? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే, మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా ఇలియానాకి ఛాన్సా.? అంటూ మరో వర్గం ఆడియన్స్ నివ్వెరపోతున్నారు. మొత్తానికి ఇలియానా త్వరలో తెలుగులో నటించబోయే ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో కానీ, పాప అఫీషియల్ రివీల్ చేస్తే కానీ తెలీదు.