బెల్లీ బ్యూటీ ఇలియానాకి తెలుగు సినిమా అంటే చిన్న చూపు. ఈ విమర్శ ఇప్పటిది కాదు. ఈ కారణంగానే ఇలియానాని టాలీవుడ్ నుండి బయటికి పంపేశారు.. అనేది ఓ అభిప్రాయం. చాలా కాలం తర్వాత తెలుగులో ఇలియానా చేసిన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ'.
ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ఆఫర్ దక్కించుకున్న ఇలియానా అస్సలేమీ మారలేదు. తాను నటించిన సినిమా ప్రమోట్ చేసుకోవడం ఏ హీరోయిన్‌కైనా కనీస బాధ్యత. ఇలియానా మాత్రం తెలుగు సినిమాల విషయంలో నాకేం సంబంధం అన్నట్లు వ్యవహరిస్తుంటుంది. అదే బాలీవుడ్‌లో సినిమాలు చేస్తే ప్రచారం విషయంలో అత్యుత్సాహం చూపిస్తుంది. అమర్ అక్బర్ ఆంటోనీ ప్రమోషన్స్ ఉదృతంగా సాగుతున్నా ఇలియానా ఎక్కడా కనిపించడం లేదు.
ప్రమోషన్స్‌కి ఇలియానా అస్సలు సహకరించడం లేదని టాక్ బయటికి వచ్చేసింది. దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కానీ, దర్శకుడు శీను వైట్ల కానీ ఓపెన్ అవలేదు. ఇదిలా ఉంటే, ఇలియానాతో ప్రమోషన్స్ ముందు ముందు ఉంటాయనీ, ఇలియానా చాలా కమిటెడ్ పర్సన్ అనీ, ఆ కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పుకుందనీ, కొందరు అంటున్నారు.
ఇంతకీ ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రమోషన్స్‌కి సహకరిస్తుందా.? సహకరించట్లేదా.? తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. కానీ 16న సినిమా రిలీజ్. ఇప్పటికే ఇలియానా ప్రమోషన్స్‌లో పాల్గొని ఉంటే సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయ్యేది.