చ‌ర‌ణ్‌ని దాటేసిన చిన్న సినిమా

By iQlikMovies - November 10, 2018 - 11:51 AM IST

మరిన్ని వార్తలు

రామ్‌చ‌ర‌ణ్ - బోయ‌పాటి ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న `విన‌య విధేయ రామా` టీజ‌ర్ నిన్నే బ‌య‌ట‌కు వ‌చ్చింది. మాస్ అప్పీల్‌తో చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకొంటోంది. తొలి రోజే ఏకంగా 15 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. 

అయితే... నిన్న‌నే విడుద‌లైన మ‌రో చిన్న సినిమా `కేజీఎఫ్‌` ట్రైల‌ర్‌... చ‌ర‌ణ్ టీజ‌ర్‌ని సైతం డామినేట్ చేసేసింది. తొలిరోజు ఏకంగా 6 మిలియ‌న్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది `కేజీఎఫ్‌`. అంతేకాదు.. యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో అదే నెంబ‌ర్ వ‌న్‌. 15 మిలియన్ వ్యూస్‌ని తెచ్చుకున్న `వియ‌న విధేయ రామా` యూట్యూబ్ ట్రెండింగ్‌లో లేక‌పోవడం విశ్లేష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అన్ని వ్యూస్ వ‌చ్చిన‌ప్పుడు క‌చ్చితంగా నెం.1లో ఉండాలి. కానీ ఆ స్థానం డ‌బ్బింగ్ సినిమా `కేజీఎఫ్‌`కి ద‌క్కింది. 

నిజానికి కేజీఎఫ్ ట్రైల‌ర్ చాలా బాగుంది. కొత్త‌గా అనిపించింది. డైలాగులూ ఆక‌ట్టుకున్నాయి. స్టార్ హీరో లేక‌పోయినా, స్టార్ కాస్టింగ్ క‌నిపించ‌క‌పోయినా ఈ ట్రైల‌ర్ ఈ స్థాయిలో వ్యూస్‌ని ద‌క్కించుకుందంటే.. దానికి కార‌ణం.. ట్రైల‌ర్లో ఉన్న విష‌య‌మే. బ‌హుశా అదే... యూ ట్యూబ్‌లో ఈ ట్రైల‌ర్ ట్రెండ్ అయ్యేలా చేసిందేమో..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS