పెళ్లయ్యాక సమంత గేరు మార్చింది. `యూటర్న్`తో నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని ఎంచుకోవడం మొదలెట్టింది. `రంగస్థలం`లో రామలక్ష్మి లాంటి డీ గ్లామర్ పాత్ర చేయడం కూడా ఓ రకంగా సాహసమే.
ఇప్పుడు మరో సాహసానికి పూనుకుంది. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సురేష్ బాబు నిర్మాత. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఓ పాత్ర లో 20 ఏళ్ల అమ్మాయిగా, మరో పాత్రలో ఎనభై ఏళ్ల ముసలమ్మగా కనిపించబోతోందట. కొరియన్ సినిమా `మిస్ గ్రానీ`కి ఇది అఫీషియల్ రీమేక్.
అమ్మమ్మ - మనవరాళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. అమ్మమ్మ పాత్రలో ఓ సీరియర్ నటిని ఎంచుకోవాలనుకున్నారు. అయితే ఈ పాత్రలోనూ సమంతే కనిపిస్తే బాగుంటుందని నందినిరెడ్డి భావిస్తోందట. దానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
అదే జరిగితే... సమంత కెరీర్లో ఇదో మేలిమిమలుపు కావొచ్చు.