గోవా బ్యూటీ ఇలియానా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె ఫిజిక్కే. సన్నజాజిలాంటి ఆమె నడుముకు ఎంతమంది ఫ్యాన్సో. అలాంటిది ఇలియానా ఇప్పుడు బొద్దుగా మారిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటారా? ఈ మధ్య ఇలియానాకి సినిమాల్లో ఆఫర్లు కొంచెం సన్నగిల్లాయనే చెప్పాలి. తెలుగులో సినిమాలు చేసి ఇలియానా చాలా కాలమే అయ్యింది. బాలీవుడ్‌లో అడపా దడపా సినిమాలు చేస్తోంది. సహజీవనం అవీ ఇవీ అంటూ కొంచెం ఫిజిక్‌ని లైట్ తీసుకుందట ఇల్లీ బేబ్. దాంతో కొంచెం బొద్దుగా మారిందట. ఆ విషయాన్ని గమనించిన ఇల్లీ బేబ్ సన్నబడ్డానికి కసరత్తులు చేస్తోందట. జిమ్‌ల చుట్టూ తిరుగుతోందట. గతంలో రవితేజ హీరోగా వచ్చిన సినిమా 'కిక్'లో ఇలియానా కొంచెం బొద్దుగా కనిపించింది. అయినా కానీ చాలా ముద్దుగా ఉంది కూడా. అప్పుడు ఓ యాక్సిడెంట్ నిమిత్తం బెడ్ రెస్ట్‌లో ఉన్న కారణంగా ఇలియానా అలా బొద్దుగా మారిందన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ తన ఒరిజినల్ ఫిజిక్‌లోకి వచ్చేసింది ఇలియానా. మళ్లీ ఇప్పుడు అలాగే కొంచెం ఒళ్లు చేసిందంటున్నారు. అందుకే స్విమ్మింగ్‌లు, గట్రా చేస్తూ ఒళ్లు తగ్గించే పనిలో పడిందట. అయినా హీరోయిన్స్‌కి అవసరానికి తగ్గట్లుగా ఒళ్లు పెంచడం, మళ్లీ వెంటనే తగ్గించడం మామూలే. ముద్దుగుమ్మ అనుష్క చూడండి సినిమా కోసం ఎంత లావుగా అయినా మారిపోతుంది. అలాగే మళ్లీ నాజూగ్గానూ మారిపోతుంది. అంతే. అలాగే ఇప్పుడు ఇలియానా అయినా. అవకాశాలున్నా లేకున్నా, ఫిజిక్ కంట్రోల్‌లో పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ కదా ముద్దుగుమ్మలకి. సో అదే భయం ఇలియానాకి. అందుకే ఈ కసరత్తులు. ఏది ఏమైనా ఇలియానా చిక్కితేనే కాదు, కొంచెం బొద్దుగా ఉన్నా ఏం కాదులే.. చక్కగానే ఉంటుంది.