'హలో గురూ ప్రేమ కోసం' ఇలియానా.!

మరిన్ని వార్తలు

బెల్లీ బేబీ ఇలియానా పాత ఫ్రెండ్స్‌ని ఒక్కొక్కరిగా కలుస్తోంది. ఎందుకో తెలుసా? అవకాశాల కోసమట. మొన్నామధ్య మాస్‌ రాజా రవితేజని కలిసింది. ఆయన పక్కన 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' సినిమలో ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా యంగ్‌ హీరో రామ్‌ని కలిసింది. రామ్‌తోనే ఇలియానా తెలుగు తెరకు పరిచయమైంది. రామ్‌ - ఇలియానా జంటగా 'దేవదాస్‌' చిత్రంలో నటించారు. 

ఇద్దరికీ ఇదే ఫస్ట్‌ సినిమా. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నది లేదు. ఫ్రెండ్లీగా కూడా పెద్దగా కలిసింది లేదు. అయితే లేటెస్టుగా రామ్‌ని ఇలియానా కలిసింది. రామ్‌తో కలిసి దిగిన ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. చిన్ననాటి స్నేహితురాల్ని కలుసుకున్నట్లుగా ఉంది ఇలియానాని కలుసుకోవడం అని రామ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. 

ఇకపోతే కెరీర్‌ పూర్తిగా డల్‌ అయిపోయిన తరుణంలో ఇలియానా పాత ఫ్రెండ్స్‌ని కలుసుకోవడంలోని ఆంతర్యమేంటబ్బా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రామ్‌ సినిమాలో ఛాన్స్‌ కోసమే ఇలియానా ఆయన్ని కలిసిందంటూ గాసిప్‌ ప్రచారంలో ఉంది. తన సినిమాలో ఛాన్సిస్తానంటూ రామ్‌, ఇలియానాకి మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. రవితేజ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్లుగానే, రామ్‌తో కూడా ఓ ఛాన్స్‌ కొట్టేసిందేమో ఇలియానా చూడాలి మరి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS