గోవా బ్యూటీ ఇలియానా 'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్ ఛైర్‌ని అధిష్టించింది. అయితే గత కొంతకాలంగా ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అంతేకాదు, తెలుగులో స్టార్‌డమ్ సంపాదించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌కెళ్లి, తనకు ఆ స్థాయిలో స్టార్‌డమ్ కట్టబెట్టిన తెలుగు చిత్రసీమపై అవాకులు చవాకులు చేసింది.
అలాంటిదిప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంటోంది. ఈ మధ్య ఇలియానా టాలీవుడ్ రీ ఎంట్రీ షురూ అయ్యిందనీ, అది మాస్ రాజా రవితేజ సినిమాతోననీ ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఈ సందర్భంగానే ఇలియానా గతంలో రవితేజాతో నటించిన 'కిక్' చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ సినిమాలో తన పాత్ర మర్చిపోలేనిదనిదని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే, ఇలియానా ఏంటిలా మారిపోయిందని తెలుగునాట కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
అయినా బాలీవుడ్‌లో ఇలియానా కెరీర్ బాగానే ఉంది. అయితే పెళ్లయ్యాకా ఎక్కువ కాలం హీరోయిన్‌గా కొనసాగడం కష్టమని తెలుసుకున్న ఇలియానా వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ అవకాశాల్ని కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ చేసే టాలీవుడ్‌పై కన్నేసిందేమో అనుకుంటున్నారంతా. అయినా ఇలియానాకి రవితేజతో నటించిన 'కిక్' హిట్ అయినా, అదే రవితేజతో చేసిన 'ఖతర్నాక్', 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
సో ఒకవేళ తాజా ప్రచారం నిజమైతే, ఇలియానా, రవితేజకి ప్లస్ అయ్యే ఛాన్సే లేదు.