ప్రముఖ టెలివిజన్ యాంకర్ లోబో (మహమ్మద్ ఖయ్యుం) ఈరోజు ఉదయం హైదరాబాద్-వరంగల్ రహదారి పైన యాక్సిడెంట్ కి గురయ్యాడు.
ఆ వివరాల్లోకి వెళితే, వరంగల్ నుండి తన సొంత కారులో బయలుదేరిన లోబో మార్గమధ్యంలో రఘునాధపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోని డీ-కోట్టాడు. అయితే ఆ సమయంలో కారు, ఆటో రెండు వేగంగా ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నది.
కారు ఒక వైపు పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఆటో విషయానికి వస్తే, అది పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట.
ఈ ప్రమాదంలో లోబో కూడా గాయపడడంతో అతన్ని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్సందిస్తున్నారు.