'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో బెల్లీ బేబీ ఇలియానా రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే రొటీన్ కమర్షియల్ సినిమా కాదిది. హీరోయిన్‌కి అంతగా ప్రాధాన్యత ఉండదట ఈ సినిమాలో.
పాటలు కూడా తక్కువే ఉంటాయట. ఈ మధ్య సినిమాల్లో పాటల ప్రాధాన్యత తక్కువైపోయింది. అయితే బ్యాక్ గ్రౌండ్ సిట్యువేషనల్ సాంగ్స్ ఉంటున్నాయి. లేదంటే సాంగ్స్ కౌంటే తగ్గించేస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో పాటలుంటేనే హీరోయిన్స్‌కి ప్రాధాన్యత దక్కినట్లు. అది కూడా గ్లామర్ యాంగిల్ నుండే తప్ప. యాక్టింగ్ పర్‌ఫామెన్స్ పరంగా కాదు. అయితే కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీస్‌కి హీరోయిన్స్ పాత్రలతో అంతగా పనుండదు.
'అమర్ అక్బర్ ఆంటోనీ' విషయానికి వస్తే, ఈ సినిమాలో ఇలియానాది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనీ సమాచారమ్. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తోంది. రవితేజ మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నాడు. కానీ హీరోయిన్ ఒక్క ఇలియానా మాత్రమే. ట్రైలర్‌లో రెండు మూడు చోట్ల ఇలియానాకి చోటు దక్కింది కానీ, సినిమాలో అంత సీను ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అనూ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానా వచ్చి చేరింది.
ఏదేమైతేనేమి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందినా ఇప్పుడంతగా క్రేజ్ లేని ఇలియానాకి ఏదో ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడమే కావాల్సింది. అయితే ఇలియానా పాత్రకున్న ప్రాధాన్యత ఎంతో ఏమిటో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. నవంబర్ 16న వరల్డ్ వైడ్‌గా 'అమర్ అక్బర్ ఆంటోనీ' రిలీజ్ కానుంది.