ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఇండియన్ 2' సినిమాపై వచ్చిన గాసిప్స్ ఈ మధ్య మరో సినిమాపై రాలేదంటే అతిశయోక్తి కాదు. గాసిప్స్‌ని ఎదుర్కొని ఎట్టకేలకు సినిమా సెట్స్ మీదికెళ్లింది. కొంత మేర షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఇక తాజా షెడ్యూల్ కోసం 'ఇండియన్ 2' టీమ్ రాజమండ్రిలో సందడి చేస్తోంది. వివరాల్లోకి వెళితే, జైలు నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాల చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. అందుకోసం రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికైంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో షూటింగ్ స్పాట్ నుండి విడుదలైన కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో విశ్వనటుడు కమల్ హాసన్ క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నారు. చుట్టూ పోలీసులు, సిబ్బంది తదితర జనాలతో కోలాహలంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ అప్డేట్తో 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ ఆగిపోలేదు. కంటిన్యూ అవుతుందని తెలుసుకోవడానికి అవకాశం కల్పించింది. 96లో సంచలన విజయం అందుకున్న 'ఇండియన్' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఇది.
దాదాపు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ ఈ సీక్వెల్లో నటిస్తున్నారు. చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ మరో హీరోయిన్గా నటిస్తోంది. హీరో సిద్దార్ద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతోంది.