గద్దలకొండ గణేష్‌తో 'భీష్మ'!

మరిన్ని వార్తలు

'వాల్మీకి' సినిమాలో కొందరు గెస్ట్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. వారిలో డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో నితిన్‌ ఉన్నారు. ఈ సినిమా విడుదలకు దగ్గరైన నేపథ్యంలో ప్రమోషన్స్‌ హీట్‌ పెంచారు. ఈ క్రమంలో గెస్ట్‌ రోల్‌ పోషించిన నితిన్‌ కూడా తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఇంతవరకూ నితిన్‌ ఈ సినిమాలో నటించాడన్నది ఓ ప్రచారంగా మాత్రమే తెలుసు. కానీ, తాను కూడా ఈ సినిమాలో భాగం అని తాజాగా నితిన్‌ ట్విట్టర్‌ ద్వారా కన్‌ఫామ్‌ చేశాడు.

 

సో వరుణ్‌ సినిమాలో నితిన్‌ అన్న మాట నిజమే అని తేలిపోయింది. ఈ సినిమాలో హీరో అధర్వ రీల్‌ లైఫ్‌ డైరెక్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. అంటే సినిమాలో సినిమా చూపిస్తాడన్న మాట. ఆ సినిమాలో వచ్చే క్యారెక్టర్సే నితిన్‌, సుకుమార్‌, బ్రహ్మానందం అట. ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఓ పోస్ట్‌ పెట్టాడు. నితిన్‌ పోస్ట్‌కి ఫ్యాన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

'మిస్టర్‌ గద్దలకొండ గణేష్‌'తో నేను, ఈ సినిమాలో నేనూ ఓ భాగం అయినందుకు సంతోషిస్తున్నా. సెప్టెంబర్‌ 20న 'వాల్మీకి' దుమ్ము లేపాల హరీష్‌ అన్నా..' అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం నితిన్‌ 'భీష్మ' చిత్రంలో నటిస్తున్నాడు. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్‌ ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS