గ్లామ్‌షాట్‌: పాపకి 'ఆ' ఎకసెక్కాలు ఎక్కువేనండోయ్‌!

మరిన్ని వార్తలు

మోము సరిగా కనిపించకపోయినా, చూపించాల్సినవన్నీ బాగా చూపించేస్తోంది. ఇంతకీ ఎవరీ పాప అనుకుంటున్నారా? పేరు మాళవికా మోహనన్‌. రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండతో 'హీరో' సినిమాలో నటిస్తోంది. మన హీరోగారికి ఈ మాత్రం ఉండాలిలెండి. ఒళ్లంతా కళాత్మకంగా బ్లూ కలర్‌ పెయింట్‌ వేసుకున్నట్లుంది కానీ, డ్రస్‌ ధరించినట్లుగా లేదు.. అంటూ ఆ పిక్‌ చూసిన కొందరు నెటిజన్స్‌ అంటున్నారు. నిజమే అదేదో చెమ్కీ ప్యాటర్న్‌లా మెరిసిపోతోంది అమ్మడి డ్రస్‌.

 

హెయిర్‌తో ఒక సైడ్‌ ఫేస్‌ని కవర్‌ చేసి, స్టైలిష్‌గా ఓ పోజిచ్చింది. యాక్సెసరీస్‌ ఏమీ లేవు కానీ, హాట్‌ హాట్‌గా మెరిసిపోతున్న క్లీవేజ్‌ సొగసులే ఆమె ఒంటికి ఆభరణాల అందం తెచ్చిపెడుతున్నాయి. పిక్‌ మాత్రం అద్దిరిపోయిందిలెండి. సినిమా వచ్చేదాకా టాలెంట్‌ గురించి వెయిట్‌ చేయకుండా, అందాల టాలెంట్‌ని ముందుగానే పరిచయం చేసేసిందీ హాట్‌ పాప. నెట్టింటి కోసం అందాల ఎగ్జిబిషనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక స్క్రీన్‌పై అందాల విందు ఇంకెలా ఉండబోతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS