పిక్ చూడగానే ఎప్పుడో ఎక్కడో చూసినట్లుందే ఈ వయ్యారి భామ అనిపిస్తుంది కదా. అవును తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అప్పుడెప్పుడో 'దగ్గరగా దూరంగా' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను హాయ్ అంటూ పలకరించింది. గుర్తొచ్చిందా హా.! పేరు వేదిక. ఆ సినిమాలో అమ్మడి క్యూట్ అప్పియరెన్స్‌కి అంతా జూనియర్ నగ్మా అంటూ ఈమెని ముద్దుగా పిలుచుకోవడం మొదలు పెట్టేశారు. స్టార్ హీరోయిన్ కాదగ్గ అన్ని ప్రత్యేకతలూ ఈ ముద్దుగుమ్మలో ఉన్నాయని గుర్తించారు.
కానీ కాలం కలిసి రాలేదు. తర్వాత 'బాణం', 'విజయ దశమి' సినిమాల్లో నటించింది కానీ పెద్దగా ఫామ్‌లోకి రాలేకపోయింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళంలో బిజీగా గడుపుతోంది. హిందీలో 'ది బాడీ' అనే సినిమాలో నటిస్తోంది. లారెన్స్‌తో వేదిక నటిస్తున్న 'కాంచన 3' మూవీ త్వరలో విడుదల కానుంది. ఇక గ్లామర్ విషయమంటారా.? పుష్కలంగా ఉంది. చూస్తున్నారుగా యాష్ కలర్ డ్రస్సులో అమ్మడి అందాలు చూపు తిప్పుకోనీయకుండా చేయట్లా. దటీజ్ ది గ్లామర్ స్పెషాలిటీ ఆఫ్ వేదిక.