పోర్న్‌స్టార్‌ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌?

By iQlikMovies - January 20, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

అప్ప‌ట్లో వేశ్య పాత్ర‌ల‌కు బాగా డిమాండ్ ఉండేది. గ్లామ‌ర్‌గా ఉంటూ, బోల్డ్‌గా క‌నిపిస్తూ... ప్రేక్ష‌కుల్ని క‌వ్విస్తూ, విమ‌ర్శ‌కుల్నీ మెప్పించొచ్చ‌ని క‌థానాయిక‌ల ఆలోచ‌న‌. క్ర‌మంగా ఈ త‌ర‌హా పాత్ర‌లు బాగా త‌గ్గిపోయాయి. సినిమా `వేశ్య‌` పాత్ర నుంచి `పోర్న్ స్టార్‌` స్థాయి వ‌ర‌కూ ఎదిగింది. దాంతో.. క‌థానాయిక‌ల ఆలోచ‌న‌లూ మారాయి. ఈ త‌ర‌హా పాత్ర‌లు ఇప్పుడు ఎక్కువ‌వుతున్నాయి. అయితే పోర్న్ స్టార్‌గా క‌నిపించ‌డానికి క‌థానాయిక‌లు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఇలాంటి పాత్ర‌ల్లో ఏమాత్రం ఎక్కువ త‌క్కువ‌లు క‌నిపించినా, మ‌రీ డీ గ్రేట్ అయిపోవ‌డం ఖాయం. అందుకే అంత భ‌యం.

 

కానీ.. ఈ భ‌యాల్ని ప‌క్క‌న పెట్టి ర‌మ్య‌కృష్ణ పోర్న్ స్టార్ గా క‌నిపించ‌డానికి సిద్ధ‌మైంది. త‌మిళంలో 'సూప‌ర్ డిల‌క్స్‌' పేరుతో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. విజ‌య్ సేతుప‌తి, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. ఇందులో పోర్న్ స్టార్ పాత్ర చాలా కీల‌కం. ఆ పాత్ర కోసం చాలామందిని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. కానీ ఎవ్వ‌రూ అంగీక‌రించ‌లేదు. ఆఖ‌రికి ర‌మ్య‌కృష్ణ ముందుకొచ్చింది. ఈ పాత్ర చాలా బోల్డ్‌గా సాహ‌సోపేతంగా ఉంటుంద‌ని టాక్‌. బాహుబ‌లిలో శివ‌గామిగా మెప్పించిన ర‌మ్య‌.. ఈ పాత్ర‌లో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS