పదే పదే ఆ హీరో పేరు చెబుతున్న కియారా.!

మరిన్ని వార్తలు

వస్తూ వస్తూనే వరుసగా స్టార్‌ హీరోస్‌ పక్కన అవకాశాలు కొట్టేయడంతో పాటు, తొలి సినిమా 'భరత్‌ అనే నేను'తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న అందాల భామ కియారా అద్వానీ. సెకండ్‌ మూవీ 'వినయ విధేయ రామ' టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో మరో స్టార్‌ హీరో సినిమాకి ఓకే చేసిందని సమాచారమ్‌. ఇక హిందీలో 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌'లో నటిస్తోంది. 

 

లేటెస్టుగా ఈ సినిమా నుండి విడుదలైన కియారా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఒరిజినల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఇకపోతే అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నానని తెలిసినప్పుడే ఆ సినిమాని తెలుగులో చూసిందట కియారా. అప్పటినుండి విజయ్‌ దేవరకొండకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయిందట. గతంలోనూ ఈ ముద్దుగుమ్మ ఈ మాట పలుమార్లు చెప్పింది. తనకు నచ్చిన హీరోల లిస్టులో విజయ్‌దేవరకొండ పేరు ఫస్ట్‌ వరసలో ఉంటుందని మళ్లీ ఇంకోసారి గుర్తు చేస్తోంది ఈ అందాల వసుమతి. 

 

ఇకపోతే 'కబీర్‌సింగ్‌' సినిమా విషయానికి వస్తే తెలుగు వెర్షన్‌కీ, హిందీ వెర్షన్‌కీ అస్సలు సంబంధమే ఉండదట. పూర్తిగా బాలీవుడ్‌ నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారట. ఇప్పటివరకూ వచ్చిన ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. 'కబీర్‌సింగ్‌'తో పాటు, బాలీవుడ్‌లో ప్రస్తుతం మరో బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నానని చెప్పింది కియారా. ఇకపోతే 'అర్జున్‌రెడ్డి' మూవీ తమిళంలో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS