ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మారాయి. ఒకప్పుడు వంద కోట్లు వస్తే ఆశ్చర్యంగా ఉండేది. వంద కోట్లు పెట్టుబడే హై బడ్జెట్ అన్నట్టు ఉండేది. కానీ ఇప్పడు వందల కోట్లు దాటి వేల కోట్లకి చేరుకుంది ఇండియన్ సినిమా కలక్షన్స్. ప్రస్తుతం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప 2 మూవీ 17 రోజుల్లోనే 1700 కోట్లు దాటి కలక్ట్ చేసింది. ఇలా 1000 కోట్ల కలక్షన్స్ తో ఇండియన్ సినిమా సక్సెస్ కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు.
ప్రజంట్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతూ బడ్జెట్ లెక్కలు మారిపోయాయి. మేకింగ్, యాక్టింగ్ స్టైల్ తో పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూల్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఈ కోవలో పయనిస్తోంది. వంద కోట్లు కలక్ట్ చేస్తేనే నిన్న మొన్నటివరకు ఆహా అన్నారు. అలాటిది ఇప్పడు వారం తిరగకుండానే వెయ్యి కోట్ల కలెక్షన్లు కామన్ అయిపోయాయి. తెలుగు సినిమాలు వరుసగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. ఇందులో ఎక్కువ సినిమాలు తెలుగు సినిమాలే ఉండటం గమనార్హం.
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' మూవీ నిలిచింది. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ మూవీ 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, వరల్డ్ వైడ్ గా 2 వేల కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ ప్లేసులో బాహుబలి 2 నిలిచింది. రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల కలక్ట్ చేసింది. థర్డ్ ప్లేస్ లో RRR నిలిచింది. చెర్రీ, ఎన్టీఆర్, జక్కన్న కాంబోలో వచ్చిన ఈ సినిమా 1390 కోట్లు వసూల్ చేసింది. ఫోర్త్ ప్లేస్ లో యశ్, నీల్ కాంబో మూవీ కేజీఎఫ్ 2 1280 కోట్లు వసూల్ చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల వసూళ్లతో టాప్ 5 లో నిల్చింది. షారుఖ్ 'జవాన్' 1148 కోట్ల వసూళ్లు,1050 కోట్ల వసూళ్లతో పఠాన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇప్పడు వచ్చిన పుష్ప 2 ఈ లెక్కల్ని తారుమారు చేసి ప్రస్తుతానికి మూడో ప్లేస్ లో నిలిచింది. ఈ వారంలో బాహు బలి 2 రికార్డ్ ని పుష్ప రాజ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల ఆలోచన.