ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఉప్పెనతో స్టార్ అయిపోయిన కృతి శెట్టి కథానాయిక. ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు మైత్రీ మూవీస్ కూడా చేతులు కలిపింది. ఈ సినిమాలో మైత్రీ కూడా భాగం అయ్యిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చిన్న సినిమాలు విరివిగా తెరకెక్కించాలని మైత్రీ గట్టిగా డిసైడ్ అయ్యింది. దాంతో పాటు.. బయటి నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే... ఈ సినిమాలో భాగం పంచుకున్నట్టు సమాచారం. ఇదో లవ్ స్టోరీ.
ఇంద్రగంటి స్టైల్ లోనే సున్నితమైన వినోదంతో సాగబోతోందని, చిత్రీకరణ పూర్తయ్యిందని, త్వరలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.