నెగెటివిటీ కన్పిస్తే ఆ వార్తలకి వుండే క్రేజ్ వేరు. ఆ స్థాయి వేరు, వాటికి వున్న స్థానం వేరు.. అని చెప్పాలేమో.! పెళ్ళి వార్త కంటే విడాకుల వార్తకి వున్న క్రేజ్ ఏ స్థాయిలో వుంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కారణంగానే, వెబ్ మీడియాలో ‘ఆ’ తరహా వార్తలకు క్రేజ్ పెరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఇదే తంతు నడుస్తోంది. మొదట్లో గాసిప్స్ ఫన్నీగా వుండేవి.. ఆ తర్వాత అవి ముదిరి పాకాన పడ్డాయి. సాఫ్ట్ న్యూస్‌కి కాలం చెల్లింది. సినిమా ఇండస్ట్రీ కూడా, అలాంటి ‘సాఫ్ట్ న్యూస్’లో నెగ్గుకొచ్చే మీడియా సంస్థల్ని లైట్ తీసుకుంది.
పాపులరిటీ కూడా నెగెటివిటీతోనే ఎక్కువ వస్తుంది గనుక, ఇష్టం వున్నా లేకున్నా.. ప్రకటనలు అటు వైపే వెళుతుంటాయి. అదే, క్లీన్‌గా నడిచే వెబ్‌సైట్లనూ సినీ పరిశ్రమ ప్రమోట్ చేస్తే.. ఇప్పుడిలా నెగెటివిటీ గురించి మాట్లాడుకునే అవసరం తగ్గేదేమోనన్నది చాలామంది అభిప్రాయం. ఇప్పటికైనా, పాజిటివిటీని స్ప్రెడ్ చేసే వెబ్‌సైట్లను సినీ పరిశ్రమ ప్రోత్సహించాలన్నది ఆయా వర్గాల నుంచి వస్తున్న ఓ సూచన మాత్రమే. కొన్నాళ్ళు హడావిడి చేసి, ఆ తర్వాత అంతా యదాతథం అయిపోతుందా గతంలోలాగా.? లేదంటే, ఏవన్నా సానుకూల మార్పులు సినిమా రంగం వైపు నుంచి వెబ్ మీడియా వైపు వస్తాయా.? అన్నది వేచిచూడాల్సిందే.