ఒక్క హిట్ వస్తే చాలు, ముద్దుగుమ్మలపై రూమర్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇంకేముంది, రెమ్యునరేషన్ పెంచేశారంటూ. గతంలో చాలా మంది ముద్దుగుమ్మలపై ఇలాంటి రూమర్స్ పుట్టినా, ఎవరికి వారు తమ స్టైల్లో స్పందించారు. కానీ, రష్మిక మాత్రం చాలా తెలివిగా స్పందించింది. రెమ్యునరేషన్ పెంచితే తప్పేంటీ.? అని ఎదురు ప్రశ్నించింది. సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఇస్మార్ట్ భామ నభా నటేష్ విషయంలోనూ ఇదే రూమర్ చక్కర్లు కొడుతోంది.
తన రెమ్యునరేషన్ డబుల్ చేసేసిందంటూ నభాపై రూమర్ హాట్ హాట్‌గా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టేస్తోంది. అయితే, ఈ రూమర్ విషయమై నభా ఏ విధంగా స్పందిస్తుందో తెలీదు కానీ, 'ఇస్మార్ట్ శంకర్' నభాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు భామలు నిధి, నభాలలో నిధికి ముందు నుండే మంచి క్రేజ్ వుంది. కానీ, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి నభా ఎక్కువ మార్కులు కొట్టేసింది. నిజానికి సినిమాలో ఆమె క్యారెక్టర్ నిధితో పోల్చితే నిడివి తక్కువే. కానీ పర్ఫామెన్స్ బేస్డ్ ఎక్కువ మార్కులు దక్కించుకుంది. హాట్నెస్లోనూ హండ్రెడ్ పర్సంట్ మార్కులు కొల్లగొట్టేసింది.
పూరీతో ఏకంగా 'ఇలియానా 2.0' అని పొగిడించేసుకుంది కూడా. దాంతో నభాకి అర్ధమైపోయింది. అసలు సిసలు ఇస్మార్ట్ భామని నేనేనని. సో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇది నిజంగా నభా మనసులోని మాటేనా.? లేక సిట్యువేషనల్‌గా పుట్టుకొచ్చిన గప్‌చుప్ గాసిప్నా.? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం నభా రవితేజతో 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.