స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ 'కథానాయకుడు', ఎన్టీఆర్ 'మహానాయకుడు'గా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న అంటే మరో 6 రోజుల్లోనే 'కథానాయకుడు' ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత వచ్చే నెల్లో 'మహానాయకుడు'గా ఎన్టీఆర్ వస్తాడు.
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితచరిత్రలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. ఒకటి సినీ జీవితం. రెండోది రాజకీయ జీవితం. 'కథానాయకుడు'లో సినీ జీవితం అంతా ఉంటుందనీ, 'మహానాయకుడు'లో రాజకీయ జీవితాన్ని చూడబోతున్నామనీ ఇప్పటిదాకా ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా, రాజకీయం ఎన్టీఆర్ జీవితంలో కలగలిసి ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఎన్టీఆర్‌ని సినీ నటుడిగా ఆరాధించారు.
దాంతో ఫస్ట్ పార్ట్‌ని ఎక్కడ ఎండ్ చేస్తారు.? సెకండ్ పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది.? అనే అంశాలపై ఆశక్తి నెలకొంది. రాజకీయపార్టీని స్థాపించడం దగ్గర ఫస్ట్ పార్ట్‌ని క్లోజ్ చేస్తారని సమాచారమ్. రెండో పార్ట్‌లో రాజకీయంగా ఎదుగుదల తప్ప ఎన్టీఆర్ చివరి రోజుల్ని చూపించకపోవచ్చునట. కాగా లేటెస్ట్ పోస్టర్‌లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్‌లో సైకిల్ మీద దర్శనమిచ్చారు. ఈ ఫోటో వైరల్‌గా మారింది.