ఐక్లిక్ టాక్ అఫ్ ది వీక్: చెలియా

మరిన్ని వార్తలు

ఈ వారం సోలోగా రిలీజ్ అయిన మణిరత్నం చెలియా పైన పబ్లిక్ టాక్ ఎలా ఉందో, బాక్స్ ఆఫీస్ వద్ద దీని వసూళ్ళ పరిస్థతి ఏంటి అనేది ఈ క్రింద మాట్లాడుకుందాం. 

మణిరత్నం- ఈ పేరు చాలు ఓ సగటు సినిమా అభిమాని ధియేటర్ వరకు రావడానికి. అలా అని చెప్పి చెప్పి సినిమాలో విషయం లేకపోతే అది మణిరత్నం సినిమా అయిన ప్రేక్షకులు లేక్కచేయరనే విషయం మనకి తెలిసిందే.

ఇక చెలియా విషయానికి వస్తే, ప్రేక్షకులు ఈ సినిమాలోని కెమెరా గొప్పతనం గురించి మాట్లాడుకున్నంతలో ఒక 10 శాతం కూడా ఇందులోని కథ గురించి మాట్లాడకపోవడం గమనార్హం. ఈ సినిమాలో లీడ్ పెయిర్ గా నటించిన కార్తీ, అదితిల అభినయానికి తోడ్పడేలా కథ లేకపోవడమే ఈ సినిమా కి పెద్ద మైనస్ అని సినిమా చూసిన సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

అయితే ఈ మధ్యన తన మార్కు హిట్ సినిమా ఇవ్వలేకపోతున్న మణిరత్నం కి ఈ సినిమా కూడా ఒక విఫల ప్రయత్నం గానే మిగిలిపోయింది అనేది ధియేటర్ల వద్ద వినిపించిన మాట.

ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడం తో ఈ సినిమాకి ఆదివారం తరువాత పెద్దగా కలెక్షన్స్ ఉండకపోవచ్చు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS