బాలీవుడ్ హీరో పై పోలీస్ కేసు?!

మరిన్ని వార్తలు

ప్రముఖ బాలీవుడ్ హీరో అయిన అర్జున్ రాంపాల్ పై పోలీస్ కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.

వివరాల్లోకి వెళితే, అర్జున్ రాంపాల్ ఢిల్లీలోని ఒక హోటల్ లో ఒక వ్యక్తిని గాయపరిచినట్టు సమాచారం. ఈ తెల్లవారుజామున అర్జున్ ని ఒక ఫోటోగ్రాఫర్ తన అనుమతి లేకుండా ఫొటోస్ తీస్తున్న సమయంలో ఆ కెమెరాని అతని దగ్గరనుండి లాక్కుని విసిరేశాడు.

అయితే అది పొరపాటున అక్కడే ఉన్న ఒక వ్యక్తి తలకి తగలడంతో అతను స్వల్పంగా గాయపడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తి పోలీసులని ఆశ్రయించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అందులో అర్జున్ ఉద్దేశ్యపూర్వకంగా చేశాడని తెలిస్తే అతని పై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS