ఐక్లిక్ వీక్లీ పాయింట్: ఐపీఎల్ Vs బాహుబలి 2

మరిన్ని వార్తలు

సర్వమతాల సమ్మేళనం మన భారతదేశం. ఈ అంశం మనల్ని ఈ ప్రపంచంలోనే ఒక వైవిధ్యమైన దేశంగా మనకు స్థానం కల్పించింది. ఇంతటి కీర్తి కలిగిన మనదేశంలో అప్పుడప్పుడు మతం పేరిట రాజకీయం చేసేవారు లేకపోలేదు. అయితే ప్రస్తుతం మన దేశంలో ఒక రెండు ప్రముఖ మతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

కంగారుపడకండి.. ఆ రెండు అనధికార మతాలు. అవే- క్రికెట్ & సినిమా. మన దేశంలో ఒక 70 శాతం పైబడి ఈ రెండింటిలో ఒక దానిని ఇష్టపడనివారు ఉండరు అనేది ఒప్పుకోక తప్పని నిజం.

ఇక విషయానికి వస్తే- ఐపీఎల్ సీజన్ మొదలయింది అంటే మనదేశంలో సమ్మర్ వచ్చేసింది అని చెప్పాలి అలాగే సినిమా పరిశ్రమ కూడా ప్రేక్షకులని టార్గెట్ చేసేది ఈ సీజన్లోనే. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు దేనికోసం దేనిని వదిలేస్తారు అనేది ఒక పరిశ్రమకి కాసులపంటని ఇంకొకదానికి నష్టాలబాటని మిగుల్చుతుంది. ఐపీఎల్ కి భయపడి చాలా సినిమాలని వాయిదా వేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

ఇది గత 9 యేండ్ల నుండి జరుగుతున్న ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకమైంది. దీనికి కారణం భారి అంచనాలతో రిలీజ్ కి సిద్ధం అవుతున్న బాహుబలి-2. ఇప్పుడు బాహుబలి చిత్రం కోసం మన  దేశం మొత్తం ఎదురుచూస్తున్నారు అలాగే ఈ చిత్రం కచ్చితంగా రూ  1000 కోట్ల వ్యాపారం చేస్తుంది అనే అంచనాల ఉన్నాయి.

ఈ సమయంలో ఐపీఎల్ ఎఫెక్ట్ ఏమైనా దీని కలెక్షన్స్ పైన ఉంటుందా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ సినిమా వచ్చే సినిమా ఐపీఎల్ సీజన్ లో ఇండియా మొత్తం మునిగి ఉంటుంది. అలాంటి తరుణంలో బాహుబలి సినిమా ఇండియాని తన వైపుకి తిప్పుకుంటుందా లేదా అనేది తెలియాలి.

చూద్దాం.. ఈ రెండు అనధికారిక మతాలైన క్రికెట్ & సినిమాలో ఏది నేగ్గుతుందో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS