ఈ వారం రెండు చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పరీక్షించుకున్నాయి.
అయితే ఈ రెండు చిత్రాల్లో పెద్దస్టార్ కాస్టింగ్ లేదు. అంటే సినిమాలో విషయం ఉంటే తప్ప సినిమాకి కలెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. అయితే కాదలి చిత్రం ఆడియో వేడుకకి మంత్రి కెటీఆర్ తో పాటు రామ్ చరణ్ రావడంతో ఈ సినిమాకి కొద్దిగా ప్రొమోషన్ లభించింది.
ఇలాంటి తరుణంలో కాదలి చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో కొద్దిగా మంచి పరిణామం. అలాగే ఓయ్ చిత్ర దర్శకుడైన ఆనంద్ రంగా ఇన్ పుట్స్ ఈ చిత్ర కథకి ఉండటం ఈ సినిమాకి మరొక ప్లస్. కథ విషయానికి వస్తే, రొటీన్ కథే అయిన దర్శకుడు కొంచెం కొత్తగా తీయడానికి ప్రయత్నించడం వల్ల సినిమాకి కొంచెం కొత్తగా వచ్చింది.
ఇక రాజా మీరు కేక విషయానికి వస్తే, కథకి సంబందించిన లైన్ బాగున్నా దానిని తీసే విధానంలో డైరెక్టర్ ఫెయిల్ అవ్వడంతో ఈ చిత్రానికి ఫస్ట్ షో నుండే బ్యాడ్ టాక్ వచ్చింది. నటీనటుల అభినయం బాగున్నా, కధనంలో పట్టు లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్.
సో.. ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఈ వారం రిలీజ్ అయిన రెంటికంటే పోయిన వారం వచ్చిన అమీ తుమీ కే కలెక్షన్స్ ఎక్కవ ఉన్నట్టు సమాచారం.