చైతు-సమంతాల పెళ్లి తేది దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసిన వేళ, చైతు తమ ప్రేమ గురించిన కొన్ని విషయాలు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు.
అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా, సమంతాకి సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేయలేదట. మాములుగా మాటల మధ్యలో తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని వేరే స్టేజి లోకి తీసుకేల్దామని అని అడగగానే సమంతా ఒకే చెప్పేసింది అని చెప్పాడు.
ఇక చైతు తన ప్రేమ సంగతి ఇంట్లో చెప్పగానే, కుటుంబ సభ్యులంతా ఒక్కసారి మాట్లాడి తమ అంగీకారం తెలిపారని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి చైతు-సమంతాల ప్రేమ నుండి పెళ్లి వరకుఎటువంటి ట్విస్టులు లేకుండానే సాగిందనమాట.