ఇర్రా మోర్‌: లిప్‌ లాక్‌ ఇష్టం లేదుగానీ..

By iQlikMovies - November 19, 2018 - 11:03 AM IST

మరిన్ని వార్తలు

'భైరవగీత' సినిమాతో తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు పరిచయమవుతోంది హాట్‌ బ్యూటీ ఇర్రా మోర్‌. రా అండ్‌ కల్ట్‌ మూవీస్‌ కేటగిరీలో ఈ సినిమా ఇప్పటికే ప్రచారం కారణంగా హైలైట్‌ అయిపోయింది. రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్న సంగతి తెల్సిందే. నవంబర్‌ 30న ఈ 'భైరవగీత' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ధనంజయ హీరో. యంగ్‌ డైరెక్టర్‌ సిద్దార్ధ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా ప్రోమోస్‌లో లిప్‌ లాక్‌ సీన్‌ ఒకటి బాగా హైలైట్‌ అవుతోంది. ఇర్రా మోర్‌ ప్రొఫైల్‌ పిక్స్‌ కూడా చాలా హాట్‌గా కన్పిస్తున్నాయి. అసలు లిప్‌ లాక్‌ సీన్‌ ఎలా చేశారు? హాట్‌ అప్పీల్‌పై అభిప్రాయమేంటి? అనడిగితే, వ్యక్తిగతంగా 'హాట్‌' లుక్‌ విషయంలో తనకు పెద్దగా ఆసక్తి లేదనీ, పదుల సంఖ్యలో చుట్టూ వున్నప్పుడు వారందరి ముందూ లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌ అస్సలేమాత్రం తనకు నచ్చదని చెప్పింది హీరోయిన్‌ ఇర్రా మోర్‌. 

అయితే ఆ సమయంలో దర్శకుడు తనను కన్విన్స్‌ చేసిన తీరు, ప్రొఫెషనల్‌గా ఆలోచించినప్పుడు ఆ సన్నివేశంలో హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ ఎక్స్‌ప్రెషన్‌కి ముద్దు అవసరమని తాను గుర్తించిన సందర్భం.. తనను ఆ సీన్‌లో నటించేలా చేశాయని అంటోంది ఈ అందాల భామ. సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చానంటోన్న ఇర్రా మోర్‌, 'భైరవగీత' నిర్మాణంలో వుండగానే తనకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయనీ, అయితే మంచి కథలకే తన ప్రాధాన్యమని అంటోంది.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS