ఈమధ్యకాలంలో #MeToo క్యాంపెయిన్ ద్వారా తమిళనాట ఆమె చేసిన కొన్ని ఆరోపణలు ఆమెని వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయితే ఆమె గురించిన తెలిసిన వారు మాత్రం ఆమె మొదటి నుండి ఆమెకి నచ్చని ఏ విషయాన్నీ అయినా కుండబద్దలు కొట్టేలా చెప్తుంది.
ఇక తాజాగా ఆమెని తమిళ చిత్రాల్లో డబ్బింగ్ చెప్పేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్టుగా అక్కడి డబ్బింగ్ యూనియన్ నుండి ఆమెకి సమాచారం అందిందట. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకుంది.
ఇదే విషయమై ఆమె స్పందిస్తూ, తన ఆరోపణలని దృష్టిలో పెట్టుకునే తనని ఇలా బలిపశువుని చేశారు అని చెప్పుకొచ్చింది. అయితే తనని బ్యాన్ చేయడానికి సరైన కారణాలు డబ్బింగ్ యూనియన్ వారు చెప్పడం లేదు అని తెలిపింది. భవిష్యత్తులో మరోసారి ఆమెకి డబ్బింగ్ సభ్యత్వం ఇస్తారు అని తాను అనుకోవడం లేదు అని ముగించింది.
ఇప్పుడు ఈ బ్యాన్ అంశం తమిళనాట సంచలనామ్ సృష్టిస్తున్నది.