సంయుక్త‌కు ఇదే చివ‌రి సినిమానా?!

మరిన్ని వార్తలు

'సార్‌', 'భీమ్లా నాయ‌క్', 'విరూపాక్ష‌' చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న క‌థానాయిక సంయుక్త మీన‌న్‌. ఈ కేర‌ళ కుట్టికి తెలుగులో అభిమాన‌గ‌ణ‌ముంది. త‌న‌కు మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. చిన్న‌, మీడియం సైజు సినిమాల‌కు త‌ను మంచి ఆప్ష‌న్‌గా మారింది. అయితే.. త్వ‌ర‌లోనే సంయుక్త మీన‌న్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతోంద‌ని టాక్. సంయుక్త న‌టించిన 'డెవిల్‌' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అదే త‌న చివ‌రి సినిమా అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.


సంయుక్త పెళ్లి కుదిరింద‌ని, త‌ను ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంద‌ని, పెళ్ల‌య్యాక సినిమాల‌కు దూరం కానుంద‌న్న వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. పెళ్ల‌య్యాక సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అత్తారింటి వారు కండీష‌న్ పెట్టార‌ట‌. దానికి సంయుక్త కూడా 'ఓకే' చెప్పింద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మై సంయుక్త మీన‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.


క‌థానాయిక‌ల‌పై ఇలాంటి గాసిప్పులు రావ‌డం మామూలే. అయితే కొన్నిసార్లు ఇలాంటి గాసిప్పులే నిజం అవుతాయి కూడా. కెరీర్‌లో దూసుకుపోతున్న ఇలాంటి త‌రుణంలో పెళ్లి చేసుకొని, సెలైంట్ అయిపోవ‌డం మంచి నిర్ణ‌యం కాదేమో అన్న‌ది సంయుక్త అభిమానుల్లో తొలుస్తున్న సందేహం. సోష‌ల్ మీడియాలో కూడా సంయుక్త పెళ్లిపై ఆరాలు మొద‌లైపోయాయి. 'మీరు పెళ్లి చేసుకొంటున్న‌ది నిజ‌మేనా' అంటూ సంయుక్త‌ని అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నిస్తున్నారు. సంయుక్త మాత్రం ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకొంటోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS