కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన `భారతీయుడు` ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు `భారతీయుడు 2` కోసం కమల్, శంకర్ మరోసారి జట్టు కట్టారు. ఈ సినిమాకి ముందు నుంచీ అవాంతరాలే. షూటింగ్ కూడా చాలా సార్లు ఆగిపోయింది. ఇప్పుడైతే.. యుద్ధ ప్రాతిపదికపై షూటింగ్ జరుగుతోంది. 2023లో ఈసినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
భారతీయుడు 2 అన్నారని దీన్ని సీక్వెల్‌గా చూడలేం. ఇది ఓరకంగా భారతీయుడుకి ప్రీక్వెల్ అనుకోవాలి. ముసలి కమల్ హాసన్ (సేనాపతి) జీవితంలో ఏం జరిగింది? తన ప్రయాణం ఎలా మొదలైంది? అనేది ఈ భాగంలో చూపిస్తార్ట. కన్న కొడుకు అవినీతి పరుడని తెలిసిన సేనాపతి.. కొడుకుని తన చేతులతో చంపేసి, విదేశాలకు వెళ్లిపోవడం పార్ట్ 1లో చూశారు. పార్ట్ 2లో సేనాపతి తిరిగి భారతదేశం వస్తాడని, అయితే... సేనాపతి యవ్వనాన్ని, తన జీవితంలోని మలుపుల్నీ.. భారతీయుడు 2లో చూపించబోతున్నారని తెలుస్తోంది. తన ప్రేమకథ కూడా ఈ పార్ట్ లో కీలకమైన పాత్ర పోషించబోతోందట. ఓరకంగా.. ఇది సీక్వెల్ కమ్ ప్రీక్వెల్ అనుకోవాలి. మరి... ఈ రెండింటినీ శంకర్ ఎలా మిక్స్ చేశాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.