`నిను వీడని నేనే` సినిమాతో నిర్మాతగానూ అడుగుపెట్టాడు సందీప్ కిషన్. ఈ సినిమా హిట్టవ్వడం తన కెరీర్‌కి చాలా అవసరం. హీరోగా డౌన్ ఫాల్లో ఉన్న సందీప్... సినిమా ఫెయిల్ అయితే, నిర్మాతగానూ చాలా నష్టపోవాల్సివస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అయితే విడుదలైన తరవాత ఈ సినిమా డివైడ్ టాక్ని తెచ్చుకుంది. `కాన్సెప్ట్ బాగుంది కానీ, ఇంకా బాగా తీయాల్సింది` అంటూ విమర్శకులు సైతం లోపాలు ఎత్తి చూపారు. అయితే.. బాక్సాఫీసు పరంగా ఈ సినిమా సేఫ్ ప్రాజెక్టుగా నిలబడిపోయింది.
తొలి వారంతంలో ఈ చిత్రానికి దాదాపు 3 కోట్ల షేర్ వచ్చింది. డిజిటల్, శాటిలైట్, రీమేక్ రైట్స్ కలుపుకుంటే - ఈ సినిమా బొటాబొటీ మార్కులతో గట్టెక్కేసినట్టే. ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా నిలబడలేకపోయింది. అక్కడ కనీస వసూళ్లని అందుకోలేకపోయింది. బీ, సీ సెంటర్లలో వసూళ్లు కాస్త డల్‌గా ఉన్నాయి. ఏ సెంటర్లలో మాత్రం నిలబడగలిగింది. మొత్తానికి సందీప్ కిషన్ నిర్మాతగా ఫెయిల్యూర్ కాలేదు. అలాగని సక్సెస్సూ కొట్టలేదు. కాకపోతే.. నష్టపోకుండా, ఒడ్డున చేరుకోగలిగాడు.