బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన శ్రద్ధ ప్రదర్శిస్తోంది. 'కేశవ' అనే సినిమాలో నటిస్తోన్న ఈ భామ తన ఫైట్స్‌ని తానే స్వయంగా కంపోజ్ చేసుకుందట. మార్షల్ ఆర్ట్స్‌లో ఈ భామ ఎక్స్‌పర్ట్. చాలాకాలం క్రిందట నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'చంద్రలేఖ' సినిమాలో ఈ బ్యూటీ నటించింది. 40 ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం ఫిజిక్‌లో తేడా లేదు. అప్పటిలానే పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంది ఈ భామ. రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు చెప్పిన ఇషా కొప్పికర్, తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయని కూడా వివరించింది. అయితే 'కేశవ' తప్ప ఇంకో సినిమాకి ఈ భామ కమిట్ అవలేదట. మంచి పాత్రల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటానంటూ ఇషా కొప్పికర్, బాలీవుడ్ తర్వాత అంత ఎక్కువగా సినిమాలు నిర్మితమయ్యేది తెలుగులోనేనని, బాలీవుడ్ కంటే కూడా ఇక్కడే ఎక్కువ ప్రొఫెషనలిజం ఉంటుందని మన తెలుగు సినీ పరిశ్రమ గురించి గొప్ప గొప్పగా మాట్లాడేసింది. వయసు అనేది కేవలం శరీరానికేనని, మనసుకు సంబంధించినది కాదని, మనసుని యంగ్‌గా ఉంచుకుంటే శరీరాన్ని కూడా యంగ్‌గా మార్చుకోవచ్చంటోంది ఇషా కొప్పికర్. ఆమె మాటలు నిజమే సుమీ.