తొలిసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, 'బిగ్ కపుల్' రికార్డు కొట్టేసిన వరుణ్ సందేశ్, వితికా డే 1 నుండీ బాగానే రొమాన్స్ పండించేస్తున్నారు. మొదటి రోజే భార్యను ఎత్తి స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన సందేశ్, రెండో రోజు హగ్గులతో రొమాంటిక్ ఫీల్ క్రియేట్ చేశాడు. ఇక మూడోరోజు వితికా, నాకు 'ఐ లవ్ యూ' చెప్పి ఎన్ని రోజులయ్యిందో తెలుసా? నన్ను ఎత్తుకోవడమే మానేశావ్ అంటూ సందేశ్ దగ్గరికొచ్చి గారాలు పోవడం, ఇందాకే ఎత్తుకున్నా కదా.. అని వరుణ్ చెప్పడం, లేదు ఒక్కసారి ఎత్తుకోవా? అని ముద్దు ముద్దుగా వితికా సందేశ్‌ని కోరడం, లేదు నాకు చెయ్యి నొప్పిగా ఉందని వరుణ్ చెప్పడం అంతా ముచ్చటగా అనిపించింది.
నాగార్జున గారు చెప్పారు కాబట్టి, ఫస్ట్ డే ఎత్తుకున్నావ్.. మళ్లీ నేను నాగార్జున గారికే చెబుతా.. వరుణ్ నన్ను ఎత్తుకోవడం లేదనీ అంటూ భర్త ఎదురుగా కాసేపు వితికా గారాలు పోయింది. ఈ వీక్ నామినేషన్స్‌లో వితికా పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలిసి కావాలనే తనను నామినేట్ చేశారంటూ వితికా భర్త వరుణ్ సందేశ్ దగ్గర చెప్పుకొచ్చింది. టోటల్‌గా వితికా హౌస్‌లో ఎనర్జిటిక్‌గా అందంగా కనిపిస్తోంది. ఈ జంట కూడా చూడ ముచ్చటగా అనిపిస్తున్నారు. అలాగే కాంట్రవర్సీల్లో తనదైన స్టాండ్ తీసుకోవడంలోనూ వితికా ముందుంటోంది. చూడాలి మరి వితికా పర్ఫామెన్స్ని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఎన్ని ఓట్లేసి గెలిపిస్తారో.