ఇస్మార్ట్ శంకర్ దెబ్బకి ఈ రోజు విడుదలైన రెండు అనువాద చిత్రాలు అంతంత మాత్రమే అనిపిస్తున్నాయన్న రిపోర్ట్స్ చెబుతున్నాయి. నిజానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆమె' చిత్రం అంచనాల్ని రేకెత్తించింది. అమలాపాల్ న్యూడ్ షో ఈ సినిమాపై ఆశక్తిని రేకెత్తించింది. అయితే, అంతకు మించిన రేంజ్‌లో అందాల ఆరబోత ఉన్న 'ఇస్మార్ట్ శంకర్' ముందు 'ఆమె' నిలవలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా కావడం, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, డబుల్ గ్లామర్ ధమాకా ఆడియన్స్ దృష్టిని మళ్లించలేకపోతోందట.
దాంతో రెండో రోజూ 'ఇస్మార్ట్ శంకర్'కే హౌస్ ఫుల్స్ అవుతున్నాయనీ సమాచారమ్. ఇక అమలాపాల్ నటించిన 'ఆమె' అంతంత మాత్రంగా ఉంటే, రెండో సినిమా విక్రమ్ నటించిన 'మిస్టర్ కేకే'ని ఎప్పటిలాగే ఆడియన్స్ పట్టించుకోలేదట. ఈ మధ్య తెలుగులో డబ్బింగ్ సినిమాల పరిస్థితి ఇలాగే వుంటోంది. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య, కార్తి, విశాల్.. ఇలా తమిళ అగ్ర హీరోలందరికీ ఇలాంటి పరాభవమే ఎదురవుతోంది. పాపం ఈ సారి విక్రమ్ 'మిస్టర్ కేకే'తో టాలీవుడ్‌లో కోల్పోయిన తన మార్కెట్‌ని తిరిగి పొందాలని ఆశించాడు. కానీ, ఈ సారి కూడా అది జరగలేదు. చూడాలి మరి, వీకెండ్‌కి వచ్చేసరికి 'ఇస్మార్ట్ శంకర్'ని దాటి, ఎంతో కొంత డబ్బింగ్ సినిమాలు కూడా పుంజుకుంటాయేమో.