'ఇస్మార్ట్‌' హిట్‌తో పూరీ నెక్స్ట్‌ ఏంటీ?

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' పూరీ అనుకున్నట్లే హిట్‌ కొట్టాడు. ఎంత నమ్మకంగా కనిపించినా, లోలోపల చాలా మదన పడ్డాడట పూరీ జగన్నాధ్‌. కానీ, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఓ మోస్తరు మాస్‌ సినిమా అయితేనే జనం నెత్తిన పెట్టేసుకుంటారు. ఇక ఈ రేంజ్‌లో మాస్‌ మసాలా దట్టించి తెచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని వంక పెట్టడానికి లేకుండా హిట్‌ కట్టబెట్టేశారు ఆడియన్స్‌. తొలి రోజు రికార్డు వసూళ్లు దక్కించుకుంది. రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించింది 'ఇస్మార్ట్‌ శంకర్‌'.

 

ఇక వీకెండ్‌ వసూళ్లు 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని సూపర్‌ హిట్‌ ఖాతాలో వేసేయడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పూరీ జగన్నాధ్‌ కోరికను దాదాపుగా జనం తీర్చేసినట్లే. ఇక పూరీ నెక్స్ట్‌ ఏంటీ.? అంటే ముందే పూరీ ఓ క్లారిటీతో ఉన్నాడు ఈ క్వశ్చన్‌పై. 'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్‌ అయితే, 'డబుల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌' ఉంది మీకోసం.. అంటూ ఫ్యాన్స్‌కి మాటిచ్చేశాడు. ఇక ఆ మాట నిలబెట్టుకోవడమే తరువాయి.

 

'ఇస్మార్ట్‌' ఇచ్చిన జోష్‌తో పూరీ ఇక అస్సలు లేట్‌ చేయకుండా 'డబుల్‌ ఇస్మార్ట్‌'కి రంగం సిద్ధం చేసేయనున్నాడట. త్వరలోనే ఆ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చే దిశగా పూరీ అప్పుడే ఆలోచనలు మొదలెట్టేశాడనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. అయితే, 'డబుల్‌ ఇస్మార్ట్‌'లో కూడా రామ్‌నే హీరోగా తీసుకుంటాడా.? లేక మరెవరైనా స్టార్‌ హీరో ఈ సినిమా కోసం ముందుకొస్తాడా,? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS