'ఇస్మార్ట్‌' హిట్టు పూరీ గట్టెక్కేసినట్లేనా!!

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌తో సినిమాలు చేయాలని ఒకప్పుడు హీరోలు ఉర్రూతలూగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాబోయ్‌ పూరీనా.? అని దూరం జరిగిపోతున్నారు. ఈ తరుణంలో హీరో రామ్‌లో ఉన్న మాస్‌ పిచ్చి, ఆయనతో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాకి పురిగొల్పేలా చేసింది. రామ్‌తో తానేంటో నిరూపించుకోవాలన్న కసితో పూరీ జగన్నాధ్‌ ఈ సినిమాని తెరకెక్కించాడు.

 

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి తొలి షో నుండే పోజిటివ్‌ టాక్‌ వచ్చింది. రివ్యూలు కూడా పోజిటివ్‌గా రావడంతో, పూరీ గట్టెక్కేశాడంటూ ఆయన ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. ఓ మోస్తరు పోజిటివ్‌ టాక్‌ వచ్చినా, ఆ సినిమా నిలబడిపోవడం ఖాయం. అలాంటిది పూరీ పెట్టిన అఫర్ట్‌కి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కొట్టుకెళ్లపోతుందనే అంచనాకి వచ్చేశారు అభిమానులు. హీరోయిన్ల గ్లామర్‌ చూసైనా పండగ చేసుకుంటారు కదా! మాస్‌ ఫ్యాన్స్‌.

 

ఇక లాజిక్కుల్లేకుండా, సగటు సినీ అభిమాని ఎంజాయ్‌ చేయగల కథా, కథనాల్ని ఇనుమడింపచేశాడు 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో పూరీ. సో ఇది చాలదా! ఇస్మార్ట్‌ శంకర్‌ని ఫ్యాన్స్‌ ఇస్మార్ట్‌ హిట్‌ చేసేయడానికి. మొత్తానికి ఎలాగైతేనేం.. అంచనాల్ని అందుకున్నాడనిపిస్తోంది పూరీ జగన్నాధ్‌. అయితే, ఫైనల్‌ రిపోర్ట్‌ రావాలంటే ఇంకాస్త సమయం పడుతుందిలెండి. ఇప్పటికైతే, ఇస్మార్ట్‌ శాటిస్‌ఫేక్షన్‌ కొంతవరకూ ఓకే. ముద్దుగుమ్మల హాట్‌ హాట్‌ ప్రమోషన్స్‌ ఇస్మార్ట్‌ శంకర్‌కి బాగా కలిసొచ్చాయనాలేమో కూడా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS