ఇస్మార్ట్‌ 'ఆటిట్యూడ్‌' హైద్రాబాదీ శంకర్‌!

మరిన్ని వార్తలు

ఆటిట్యూడ్‌ గురించి మాట్లాడుకోవల్సి వస్తే, ఇంతవరకూ విజయ్‌ దేవరకొండ ఆటిట్యూడ్‌ గురించే మాట్లాడుకున్నాం. డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. విజయ్‌ దేవరకొండ. ఇది తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు ఇస్మార్ట్‌గా ఆటిట్యూడ్‌ చూపించడానికి వస్తున్నాడు మన ఇస్మార్ట్‌ శంకర్‌.

 

అసలింతకీ ఆటిట్యూడ్‌ అంటే ఏంటీ.? బూతులు తిట్టడమేనా.? అదే అయితే అవే బూతులతో టీజర్‌ మొదలు పెట్టి స్పెషల్‌ ఆటిట్యూడ్‌ ప్రదర్శించాడు మన ఇస్మార్ట్‌ శంకర్‌. పూరీ హీరోల శైలే వేరు. ఈ సంగతి తెలిసిందే. అయితే మన ఇస్మార్ట్‌ శంకర్‌ ఇంకో మెట్టు పైకెక్కి, యూత్‌ ఆటిట్యూడ్‌ చూపించడానికి సిద్ధమయ్యాడు. బూతులతోనే ఈ సినిమా టీజర్‌ మొదలెట్టాడు. ఆటిట్యూడ్‌ కదా.. ఈ టీజర్‌ బాగా జనాల్లోకి వెళ్లిపోయింది. టీజర్‌లో హీరోయిన్లు ఎవరూ కనిపించలేదు. కానీ, శంకర్‌ మాట్లాడిన 'నీ యమ్యా..' బూతు డైలాగ్‌ ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. పూరీ లాంటి డైరెక్టర్లు ఈ వివాదాల్ని పెద్దగా లెక్క చేసే టైప్‌ కాదు.

 

అరదులోనూ వివాదాలు సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడతాయన్న నిత్య సత్యాన్ని గ్రహించలేనంత అమాయకుడు కూడా కాదు మన పూరీ. మొత్తానికి టీజర్‌తో తాననుకున్న టార్గెట్‌ని రీచ్‌ అయినట్లే కనిపిస్తున్నాడు పూరీ. ఈ వివాదం మరింత దూరమెళితే, సినిమాకి మరింత పబ్లిసిటీ. చూడాలి మరి, 'రౌడీ' ఆటిట్యూడ్‌తో మొదలైన 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఫస్ట్‌ ప్రమోషన్‌ (టీజర్‌) సినిమాకి ప్రస్తుతానికి హైప్‌ తీసుకురావడంలోనూ, విడుదల తర్వాత సక్సెస్‌ తీసుకురావడంలోనూ ఎంత ఉపయోగపడుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS