మాస్‌.. ఊరమాస్‌ కా 'బాప్‌' 'ఇస్మార్ట్‌ శంకర్‌'!

మరిన్ని వార్తలు

పూరీ మాస్‌ అని తెలుసు. కానీ మరీ ఇంత మాస్‌ అని 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజర్‌ చూశాక తెలిసింది. లేటెస్ట్‌గా విడుదలైన 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజర్‌లో రామ్‌ గెటప్‌, డైలాగ్‌ డెలివరీ మాస్‌ కా బాప్‌ అనేలా ఉన్నాయి. అయితే, టీజర్‌ స్టార్ట్‌ అయిన తీరు చూస్తుంటే, అసలిది తెలుగు సినిమానా.? లేక హిందీ సినిమానా.? అన్నట్లుందని ఫ్యాన్స్‌ అనుమానపడుతున్నారు.

 

డైలాగ్స్‌ చాలా వరకూ హైద్రాబాదీ ఉర్దూ లాంగ్వేజ్‌లో కట్‌ చేయడమే ఈ అనుమానానికి కారణం. హైద్రాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో సాగే కథ అని టీజర్‌ చెప్పకనే చెప్పేసింది. ఇక రామ్‌ విషయానికి వస్తే, ఎనర్జిటిక్‌ హీరోగా రామ్‌ అందరికీ సుపరిచితుడే. మాస్‌ పల్స్‌ కూడా బాగా ఉన్నాయి రామ్‌లో. చాలా సార్లు ప్రూవ్‌ అయ్యింది ఆ విషయం గతంలో. అయితే 'ఇస్మార్ట్‌ శంకర్‌' కోసం రామ్‌ పూర్తిగా పూరీ హీరోగా మారిపోయాడు. హెయిర్‌ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌ అంతా మారిపోయింది. కొన్ని సీన్లలో అసలు రామేనా.? అనేంతగా తనను తాను మార్చేసుకున్నాడు. 'పోకిరి' కోసం మహేష్‌ లాంటి హీరోనే డిఫరెంట్‌ స్టైల్‌లోకి మార్చేశాడు పూరీ జగన్నాధ్‌.

 

ఈ మధ్య 'ఇజం' కోసం కళ్యాణ్‌రామ్‌ గెటప్‌ ఎలా మారిపోయిందో చూసేశాం. 'ఇజం' తర్వాత కొడుకు ఆకాష్‌తో 'మెహబూబా' సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమాలో అంతగా మాస్‌ ఓవరాక్షన్‌ చూపించలేదు. కానీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' కోసం మాత్రం రామ్‌ని పూర్తిగా మాస్‌ కా బాప్‌లా మార్చేశాడు పూరీ. టోటల్‌గా పూరీ మార్క్‌ ఓవరాక్షన్‌ మాస్‌ డోస్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజర్‌. ఈ రోజు రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ని విడుదల చేస్తూ, మాస్‌గా రామ్‌కి బర్త్‌డే విషెస్‌ తెలిపింది చిత్ర యూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS